Temple Bell Temple Bell
కాలభైరవ గురు సంస్థాన్ మఠం

శ్రీ వారాహీ వజ్రవారాహీ అమ్మవారి ఆలయం

The Divine Mother of Protection, Courage and Prosperity.

Om

॥ ఓం నమో భగవతీ వజ్ర వారాహ్యై స్వాహా ॥

శ్రీ వారాహీ వజ్రవారాహీ అమ్మవారి దేవాలయం
Varahi Vajra Varahi Temple Kalabhairava Guru Sansthan Mutt Kalabhairava Deeksha Ghat Aryapuram Rajahmundry 533104

Sri Varahi Ammavaru


వారాహీ వజ్ర వారాహీ టెంపుల్ మీకు స్వాగతం పలుకుతుంది

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన అరుదైన వారాహీ గుప్త దేవాలయం, అన్ని దేవాలయాల మాదిరిగా ఇక్కడ రోజు వారాహీ వజ్ర వారాహీ అమ్మవారి దర్శనం ఉండదు.
ఇది ఎన్నో సంవత్సరాల నుండి నుండి వస్తున్న ఆచారం.
ప్రపంచంలో వారాహీ వజ్ర వారాహీ అమ్మకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ మరియు విశిష్టమైన శక్తివంతమైన వజ్రవారాహీ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో గోదావరి నది తీరాన కోటిలింగాల ఘాట్ రోడ్లో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో అష్టభైరవీ , అష్టమాతృక శక్తులలో పంచమీ దేవతగా ప్రత్యేకంగా పశ్చిమ దిక్కును అనగా గోదావరి నదిని చూస్తూ, ప్రియ భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ, సకల సంపదలను, సుఖశాంతులను, శ్రేయస్సును, అష్టైశ్వర్య వజ్రవైడూర్య రత్న మణి మాణిక్యములను, మంత్రసిద్ధులను, సమస్త విజయాలను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది. పురాతన కాలము నుండి గుప్తంగా అనగా రహస్యంగా చాలామంది సాధకులు గురువులు ఉపాసకులు ఈ గోదావరి నది తీరాన అమ్మవారిని పూజించడం జరిగేది. ఈమధ్య కాలంలో మహా మంత్రోపదేశకులు పరమపూజ్య శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో మరలా పునఃప్రతిష్ట చేయబడింది.

వజ్రవారాహీ అమ్మవారి దర్శనం రోజు ఉండదు. ముఖ్య పర్వదినాలు అనగా ఆదివారము, అమావాస్య, అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7గం. ల నుండి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఉంటుంది.

ప్రపంచంలో ఏ దేవాలయములో లేనటువంటి గొప్ప సదవకాశం వారాహీ వజ్రవారాహీ దేవాలయంలో కల్పించబడింది.

సంవత్సరములో రెండు రోజులు భక్తులందరికీ (అనగా సాంప్రదాయ వస్త్రాలు ధరించినటువంటి వారికి మాత్రమే) శ్రీ వారాహీ వజ్రవారాహీ అమ్మవారి పాదస్పర్శ దర్శనం అనగా గర్భాలయ ప్రవేశం ఇక్కడ కల్పించబడింది.

గర్భాలయ ప్రవేశం చేసే భక్తులకు గురువుగారు స్వయంగా రక్షను చేతికి కడతారు. అలాగే మంత్రాలతో సంప్రోక్షణ చేస్తారు. అప్పుడు వారికి మాత్రమే అమ్మవారి పాద స్పర్శ దర్శనం లభిస్తుంది. ఇలా అమ్మవారి పాద స్పర్శ దర్శనం చేసుకోవడం భక్తులు తమ పూర్వజన్మ అదృష్టంగా, శ్రీ వారాహి వజ్రవారాహి అమ్మవారి ఆశీర్వాదంగా భావన చేస్తూ ఉంటారు.

శ్రీ వజ్ర వారాహీ అమ్మవారు అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపంగా మన సనాతన ధర్మంలోనే కాకుండా బౌద్ధధర్మంలో, జైనధర్మంలో కూడా అనేక ముద్రలతో మంత్రాలతో పూజిస్తూ ప్రత్యేక ఉపాసన అనుష్టానం సాధనలో ఆరాధించి ఎన్నో దివ్య శక్తులను పొందుతూఉంటారు.

ముఖ్యంగా వాక్సిద్ధి శక్తి, ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి, స్తంభన శక్తి మొదలైన దివ్య శక్తులను పొందుతూ ఉంటారు.

రాజమండ్రిలో వారాహి వజ్రవారాహి అమ్మవారికి ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో వారాహి మహా మంత్రాలతో భైరవ మంత్రాలతో 27 జన్మ నక్షత్రముల వారికి నవరాత్రులు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక హోమం నిర్వహిస్తూఉంటారు.

వారాహి వజ్రవారాహి అమ్మవారి సన్నిధిలో వారాహి దీక్షను స్వీకరిస్తూ ఉంటారు.

అలాగే ఈ 9రోజులపాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, వారాహీ పంచమీ రోజున మహోన్నత పుష్పాభిషేకం, వారాహీ నవనవరాత్రులు ఆఖరి రోజున వారాహీ దీక్ష విరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం జరుగును.

శ్రీ వారాహీ హోమం
శ్రీ వారాహీ గుప్త నవరాత్రులు

*వారాహీ గుప్త నవరాత్రులలో రోజుకి 3జన్మ నక్షత్రముల చొప్పున 9రోజులపాటు జరిగే వారాహీ నక్షత్ర హోమం లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవచ్చు. వారాహీ అమ్మవారి హోమ ప్రసాదంగా రుద్రాక్ష జపమాల, ఆకర్షణ కుంకుమ, చేతి మణికంఠ రక్ష, హోమంభస్మం, ధన ప్రసాదము పోస్టు ద్వారా పొందవచ్చు.

For more Details: +91-9985551028

Contact Us

Temple :
Varahi Vajra Varahi Temple
Kalabhairava Guru Sansthan Mutt,

+91 9985551028

+91 9000200117

Kalabhairava Deeksha Ghat Aryapuram,
Rajahmahendravaram-533104, East Godavari Dist, Andhra Pradesh